Hyderabad, సెప్టెంబర్ 26 -- నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈరోజు దేవి నవరాత్రుల్లో అయిదవ రోజు. అయిదవ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే మనకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

అదే విధంగా నవరాత్రుల్లో చాలామంది రకరకాల పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఈ పరిహారాలను పాటించడం వలన అమ్మవారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉండవచ్చు. మనకున్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి.

ప్రతి ఒక్కరూ సిరి సంపదల కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు, నిత్యం పనిలో నిమగ్నం అవుతూ ఉంటారు. మనకి కావాల్సిన సిరిసంపదలు లభించాలంటే అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి. ఇటువంటివి ప్రసాదించే తల్లి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా అమ్మవారిని కచ్చితంగా పూజించాల...