భారతదేశం, అక్టోబర్ 3 -- నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి వివిధ రూపాలను ఆరాధించి, మంచి జరగాలని, అనుకున్నవన్నీ జరగాలని ప్రార్థిస్తారు. అయితే, నవరాత్రులు ప్రారంభానికి ముందు ఇంటికి వీటిని తీసుకురండి. ఈ వస్తువులు అమ్మవారి అనుగ్రహం కోసం సహాయపడతాయి. మరి, ఎలాంటి వస్తువులను నవరాత్రులకు ముందు ఇంటికి తీసుకురావాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

శారదీయ నవరాత్రులు అత్యంత పవిత్రమైన పర్వదినాలుగా భావిస్తారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాలను ఆరాధించడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. నవరాత్రులు ప్రారంభానికి ముందు ఇంటికి ఈ వస్తువులను తీసుకురండి. ఇవి తీసుకురావడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

నవరాత్రి పూజలో కలశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూజా విధానాన్ని బట్టి కలశాన్ని తీసుకురండి. రాగి, ఇత్తడి...