Hyderabad, సెప్టెంబర్ 29 -- ఇక నవరాత్రులు పూర్తవబోతున్నాయి. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించడం వలన అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. అయితే మహర్నవమి నాడు కొన్ని గ్రహాల సంయోగం ఏర్పడింది. ఈ గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రానుంది. ఈ సంవత్సరం మహర్నవమి అక్టోబర్ 1న వచ్చింది.

ఈ నవరాత్రుల్లో కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం విశేషం. గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మహర్నవమి నాడు అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. బుధాదిత్య రాజయోగంతో పాటుగా కన్యరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. దీంతో భద్ర రాజయోగం ఏర్పడనుంది. అదే విధంగా నవపంచమ రాజయోగం, కేంద్రయోగం, షడాష్టక యోగం, అర్ధకేంద్...