భారతదేశం, అక్టోబర్ 31 -- నవంబర్ మాసంలో గ్రహాల గమ్యంలో కీలక మార్పులు రాబోతున్నాయి. నవంబర్ 16న సూర్య భగవానుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మకారకుడు, మానసన్మానాలు, ప్రభుత్వ ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలకు కారకుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో సూర్య గోచరం ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఖగోళ, జ్యోతిష్య గణనల ప్రకారం సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. ఈ క్రమంలోనే నవంబర్ 16, 2026 నాడు తులా రాశి వీడి వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి పయనిస్తారు. ఈ సూర్య సంచార మార్పు ద్వాదశ రాశులపై భిన్నమైన ప్రభావాలను చూపుతుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా ఎదురుచూస్తున్న వారికి ఇది కీలక సమయంగా నిపుణులు చెబుతున్నారు.

మేష రాశి వారికి సూర్య...