భారతదేశం, నవంబర్ 6 -- Sun Transit 2025: గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఇలా మార్పు జరగనప్పుడు, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. త్వరలోనే సూర్య సంచారంలో మార్పు ఉండబోతోంది. ఈ మార్పు కారణంగా ఏ రాశులకు లాభాలు కలుగుతాయి, ఏ రాశిలో వారు ఎలాంటి మార్పులను చూడొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహాల రాజు సూర్యుని నక్షత్రంలో మార్పు చోటు చేసుకోనుంది. నవంబరు 19న సూర్యుడు అనురాధ నక్షత్రంలో సంచరిస్తాడు. డిసెంబర్ 2 వరకు ఈ నక్షత్రంలో ఉంటాడు. అనురాధ నక్షత్రానికి అధిపతి శని. సూర్యుడు ఆత్మ, ధైర్యం మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. సూర్యుని నక్షత్ర సంచారంలో మార్పు కొన్ని రా...