భారతదేశం, జూన్ 22 -- నల్లగొండ పట్టణంలో అత్యంత హృదయవిదారకమైన ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బతుకుదెరువు కోసం నమ్ముకున్న వ్యాపారం సజావుగా సాగకపోవడమో లేదా మరేదైనా ఆర్థిక, కుటుంబ సమస్యల వల్లో తెలియదు కానీ, ఒక నిండు కుటుంబం ఇలా విగతజీవులుగా మారడం శోకసంద్రంలో నెట్టింది.

నల్లగొండ పట్టణ పరిధిలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న షేక్ సుల్తాన్ ఇంట్లో నుంచి గత తీవ్రమైన దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఇల్లు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి పోలీసుల...