Hyderabad, ఆగస్టు 20 -- విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి.

ఇటివలే రీలీజైన అర్జున్ చక్రవర్తి టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ చక్రవర్తి సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత శ్రీని గుబ్బల విలేకరుల సమావేశంలో ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

-మాది వెస్ట్ గోదావరి తణుకు. మా నాన్నగారు గుబ్బల రామారావు సోషల్ వర్కర్. నేను యుఎస్ వెళ్లి 18 ఏళ్లు అవుతుంది. నాకు మొదటి నుంచి క్రియేటివిటీపై ఆసక్తి ఉంది. మేం సాఫ్ట్‌వేర్‌లో కూడా క్రియేటివ్ వర్క్ చేస్తుంటాం. క్రియేటివిటీ మీద ఇష్టం డెవలప్ అవుతూ అలా సినిమాల...