Hyderabad, సెప్టెంబర్ 16 -- ఏ సమస్య, ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ ఒక్కోసారి ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. చాలా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత ఆనందం ఉన్న కొన్ని రోజులకి తొలగిపోయి మళ్ళీ బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఈ హనుమంతుడు మంత్రాన్ని రోజూ వింటే చాలా సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా నరదృష్టి మన జోలికి రాకుండా ఉంటుంది.

నరదృష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుందని అంటారు. చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. నరదృష్టి లేదా దృష్టి దోషం, ఇతరుల ప్రతికూల ఆలోచనలు, అసూయ, ఈర్ష్య వలన కలిగే శక్తి అని చాలామంది నమ్ముతారు. నరదృష్టి వ్యక్తికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా హాని కలిగిస్తుంది. వారి శ్రేయస్సుని దెబ్బతీస్తుంది. ఎదుగుదలను అడ్డుకుంటుంది. నరదృష్టి నుంచి బయటపడడానికి చాలామంది రకరకాల పరిహా...