భారతదేశం, అక్టోబర్ 3 -- ఈ వీకెండ్ లో అన్ని రకాల ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ సినిమాలు, సిరీస్ లు రెడీగా ఉన్నాయి. విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని, వివిధ శైలులలో ఆశ్చర్యాలను కలిగించే ఈ వారం మూవీస్ పై ఓ లుక్కేయండి. జియోహాట్‌స్టార్‌లో అన్నపూర్ణి, నెట్‌ఫ్లిక్స్‌లో ది గేమ్, జీ5లో చెక్‌మేట్ ఇలా చాలా సినిమాలు, సిరీస్ లే ఉన్నాయి.

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'అన్నపూర్ణి'. ఇది ఆమెకు 75వ సినిమా. ఈ మూవీ ఓటీటీలోకి కొన్ని మార్పులతో తిరిగొచ్చింది. ఈ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచారని వివాదం చెలరేగింది. అందుకు నయనతార క్షమాపణ కూడా చెప్పింది. ఇప్పుడు ఈ తమిళ్ సినిమా జియోహాట్‌స్టార్ లో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లీ, కార్తీక్ కుమార్‌ తద...