Hyderabad, జూన్ 29 -- మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ కన్నప్ప. తెలుగులో మైథలాజికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు.

ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి బిగ్ స్టార్స్ నటించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జూన్ 28న కన్నప్ప థ్యాంక్స్ మీట్ నిర్వహించింది మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో నటుడు మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ .. "ఆ భగవంతుడు ఆశీస్సులతోనే 'కన్నప్ప' చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మా టైమ్‌లో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్ప...