భారతదేశం, నవంబర్ 13 -- తెలుగులో నంబర్ 1 సీరియల్ ఇప్పుడు మరింత ఎత్తుకు ఎదిగింది. కార్తీక దీపం సీరియల్ తాజాగా 44వ వారం రికార్డు టీఆర్పీ రేటింగ్ సాధించింది. అంతేకాదు ఈసారి కూడా స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 6లోనే కాదు టాప్ 10లోనూ ఎలాంటి మార్పూ లేదు.

ఎప్పటిలాగే తెలుగు టీవీ సీరియల్స్ లో స్టార్ మా ఛానెల్ దూకుడు కొనసాగింది. ఈ ఏడాది 44వ వారం కూడా ఆ ఛానెల్ కు చెందిన 6 సీరియల్స్ టాప్ 6లో ఉన్నాయి. తొలిస్థానంలో కార్తీక దీపం 2 సీరియల్ ఉంది. ఈ సీరియల్ కు తాజాగా 15.28 రేటింగ్ రావడం విశేషం. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా 13.92 రేటింగ్ నమోదు చేసింది.

మూడో స్థానంలో ఇంటింటి రామాయణం ఉంది. దీనికి 13.30 రేటింగ్ వచ్చింది. నాలుగో స్థానంలో గుండె నిండా గుడి గంటలు నిలిచింది. కొద్దిలో మూడో స్థానం కోల్పోయిన ఈ సీరియల్ 13.19 రేటింగ్ సాధి...