భారతదేశం, ఆగస్టు 5 -- సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తోంది. తమిళ స్టార్ హీరో ధనుష్, క్యూట్ భామ మృణాల్ ఠాకూర్ డేటింగ్ లో ఉన్నారనే రూమర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. వీళ్లిద్దరూ లవ్ లో మునిగిపోయారనే కామెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ధనుష్, మృణాల్ ఎక్కువగా కలిసి కనిపించడమే ఇందుకు కారణం.

మృణాల్ ఠాకూర్ బర్త్ డే పార్టీలో ధనుష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆగస్టు 1న జరిగిన మృణాల్ బర్త్ డే పార్టీకి ధనుష్ అటెండ్ అయ్యాడు. అంతకంటే ముందు మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' మూవీ ప్రీమియర్ కూడా ధనుష్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమం కోసం వచ్చిన ధనుష్ ను మృణాల్ వెళ్లి స్వయంగా ఆహ్వానించడం వైరల్ గా మారింది. పార్టీలో ఈ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకోవడమూ హాట్ టాపిక్ అయింది.

ఈ ఏడాది జులైలోనూ ఓ పార్టీలో ధనుష్, మృణా...