భారతదేశం, అక్టోబర్ 31 -- దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకుంటాము. దీపావళి పండుగ ధన త్రయోదశితో మొదలవుతుంది. ఆ రోజు ధన్వంతరి స్వామివారిని పూజిస్తాము. అలాగే లక్ష్మీదేవిని, కుబేరుడిని కూడా భక్తితో పూజిస్తారు. ధన త్రయోదశి నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయంతో పాటుగా, యమ దీపదానం చేసే సంప్రదాయం కూడా ఉంది. ధన త్రయోదశి రోజు యమ దీపదానం ఎందుకు చేయాలి? యమ దీపం ప్రాముఖ్యత, పురాణ కథ, పూజా విధానం గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.

సాయంత్రం ధన త్రయోదశి నాడు ఇంటి బయట యమధర్మరాజు పేరు మీద దీపాన్ని వెలిగించాలి. అలా చేస్తే అకాల మృత్యు భయం తొలగిపోతుందని నమ్ముతారు. యమ దీపదానం ప్రాముఖ్యత ఏంటి? పురాణ కథ ఏంటో కూడా చూసేద్దాం.

హిందూ శాస్త్రాల ప్రకారం చూస్తే, యమధర్మరాజును మృత్యుదేవుడిగా, ధర్మానికి ప్రతిరూపంగా చెప్తారు. అయితే కార్తీక మాసంలో వచ్చే కృష్ణ పక్ష ...