Hyderabad, అక్టోబర్ 11 -- ధన త్రయోదశి చాలా విశేషమైన రోజు. ధన త్రయోదశి నాడు ఉపవాసం ఉంటే కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు ధన త్రయోదశి జరుపుకుంటాము. ఆ రోజు ధన్వంతరి, కుబేరులను పూజిస్తారు. ఈసారి ధన త్రయోదశి వేళ కొన్ని ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. ధన త్రయోదశి వేళ అరుదైన బ్రహ్మయోగం ఏర్పడుతుంది. ఇది రాత్రి వరకు ఉంటుంది.

అదే విధంగా ఎంతో విశేషమైన శివవాస యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ యోగాల కారణంగా అన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. కొన్ని రాశులు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. ఈ రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మరి ధన త్రయోదశి వేళ ఏ రాశి వారు అదృష్టాన్ని పొందబోతున్నారు, ఎవరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం....