భారతదేశం, నవంబర్ 3 -- దీపావళికి ముందు వచ్చే త్రయోదశి రోజు ధన త్రయోదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది ధన త్రయోదశి నవంబర్ 6న వచ్చింది. ఆరోజు ధన్వంతరి స్వామిని పూజించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ధన త్రయోదశి నాడు సముద్ర మథనం నుంచి అమృత కలశంతో ధన్వంతరి ఆవిర్భవించారని అంటారు. ఆయన అమృత కలశాన్ని ఎందుకు తీసుకువచ్చారు? దీని వెనుక ఉన్న పురాణ గాథ గురించి ఈరోజు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే, మహర్షి దుర్వాసుడు శాపం ఇచ్చిన కారణంగా దేవతల శక్తి క్షీణించింది. ఈ అవకాశాన్ని రాక్షసులు ఉపయోగించుకుని స్వర్గలోకాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొన్న దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్లారు. విష్ణువు దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనం చేయాలని విష్ణువు వారికి సూచించగా, సముద్ర మథనం ద్వారా అమృతం లభిస్తుంది. దానిని సేవి...