భారతదేశం, జూలై 28 -- హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్.. వీళ్లందరూ ఓ సినిమా కోసం పనిచేసే వాళ్లు కాదు. ఇవన్నీ ఒకే వ్యక్తికి సంబంధించిన విషయాలు. ఆ మల్టీ టాలెంటెడ్ నటుడే ధనుష్. ఈ రజు (జులై 28) ఈ తమిళ స్టార్ హీరో బర్త్ డే. ఈ సందర్భంగా అతని కెరీర్ లోని కొన్ని బెస్ట్ సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూద్దాం.

రీసెంట్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసిన మూవీ కుబేర. ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల డైరెక్టర్. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్ర పోషించాడు. లక్ష కోట్ల క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడొచ్చు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ యాక్టింగ్ మరో లెవల్ లో ఉంది. ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్మురేపుతోంది.

ధనుష్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార...