భారతదేశం, ఆగస్టు 26 -- అదిరిపోయే సస్పెన్స్ తో, ఉత్కంఠ రేపే ట్విస్ట్ లతో సాగే ఓ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతుంది. హీస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన అమెరికన్ రాబరీ ఫిల్మ్ 'ప్లే డర్టీ' (Play Dirty) నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలోనే డిజిటల్ ఆడియన్స్ ను అలరించనుంది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.

అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ 'ప్లే డర్టీ' నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. ఈ హీస్ట్ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతుంది. అక్టోబర్ 1న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుందని ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ''దొంగలనే దొంగిలిస్తే, అప్పుడు ఒకటే రూల్ ఉంటుంది. అదే ప్లే డర్టీ. ప్రైమ్ లో న్యూ మూవీ. అక్టోబర్ 1 నుంచి'' అని ఎక్స్ లో ప్రైమ్ వీడియో ఇండియా పోస్టు చేసింది.

ప్రైమ్ వీడియో ఓటీ...