భారతదేశం, ఆగస్టు 12 -- ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లలో ఒకటిగా ఉన్న భారతదేశంలో టెస్లా దూకుడుగా అడుగులు వేస్తోంది!. ఇటీవల ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన ఎలాన్​ మస్క్​కి చెందిన ఈ టెస్లా.. నెల లోపే, ఇప్పుడు దేశ రాజధాని దిల్లీలోని ఏరోసిటీలో తమ రెండో ఎక్స్​పీరియెన్స్​ సెంటర్​ని, తొలి ఛార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఇది భారత్‌లో టెస్లా వేగంగా విస్తరించాలన్న లక్ష్యానికి నిదర్శనం.

దిల్లీలోని ఏరోసిటీలో ఉన్న వరల్డ్‌మార్క్ 3 భవనంలో ఈ కొత్త టెస్లా ఎక్స్​పీరియెన్స్​ సెంటర్​ ఉంది. ఇక్కడ కంపెనీ ఛార్జింగ్ హబ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ ఛార్జింగ్ స్టేషన్‌లో నాలుగు డీసీ సూపర్ ఛార్జర్లు, మూడు ఏసీ డెస్టినేషన్ ఛార్జర్లు ఉన్నాయి. ఇవి వినియోగదారులకు వేగంగా ఛార్జింగ్ చేయడానికీ లేదా ఎక్కువ సమయం పార్కింగ్ చేసినప్పుడ...