భారతదేశం, ఆగస్టు 14 -- దేశ రాజధాని దిల్లీ, దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతకుముందు యెల్లో అలర్ట్ మాత్రమే ఉన్నప్పటికీ, ఉదయం వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఐఎండీ దీనిని రెడ్ వార్నింగ్‌గా మార్చింది.

రాబోయే కొన్ని గంటల్లో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

ఐఎండీ వెబ్‌సైట్‌లో జిల్లా వారీగా ఇచ్చిన నౌకాస్ట్ హెచ్చరికల ప్రకారం.. రాబోయే కొన్ని గంటల పాటు ఈ నగరంలో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. సైట్ ప్రకారం, ఉదయం 8:30 వరకు భారీ వర్షాల హెచ్చరిక అమల్లో ఉంది.

ఈ వర్షాలు, రెండు రోజుల క్రితం దిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌తో పాటు ఎన్‌స...