Hyderabad, సెప్టెంబర్ 30 -- శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైన క్షణం నుంచి ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతోంది. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో దర్శించేందుకు భక్తులు దూరదూరాల నుంచి తరలి వస్తున్నారు. అమ్మవారి అలంకార దర్శనం కేవలం భక్తి పరంగా మాత్రమే కాక, పురాణాలు, ఆధ్యాత్మికత, సాంప్రదాయం కలగలిసి ఉన్న ఒక దివ్య అనుభూతిగా నిలుస్తోంది.

పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసాధిపతి దుర్మార్గాలను అరికట్టడానికి సకల దేవతలు తమ తమ శక్తులను సమ్మిళితం చేశారు. ఆ దివ్యశక్తి రూపమే దుర్గామాత. దేవతలందరూ ఆయుధాలతో పాటు ప్రత్యేక ఆభరణాలను, వస్త్రములను కూడా అమ్మవారికి సమర్పించారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంద్రుడు సమర్పించిన మకుటం విజయానికి ప్రతీక. చంద్రుడు ప్రసాదించిన చంద్రకళ శాంతి, కాంతి సంకేతం. వరుణుడు ఇచ్చిన ...