Hyderabad, జూలై 12 -- సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ బిగ్ సినిమాల్లో కూలీ ఒకటి. ఇక ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, మలయాళ పాపులర్ యాక్టర్ సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు.

వీరితోపాటు బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ కెమియో చేయనుంది. కూలీ సినిమాలో పూజా హెగ్డే మోనికా సాంగ్‌లో మోనికా బెల్లూచి పాత్ర చేయనుందని సమాచారం. సుహాసిని, అనిరుధ్ పాడిన ఈ పాటకు ఇటాలియన్ నటి మోనికా బెలూచీ తన పేరు వాడుకోడానికి కూడా ఓకే చెప్పింది.

అయితే, తాజాగా కూలీ సినిమా నుంచి మోనిక సాంగ్‌ను రిలీజ్ చేశారు. మోనికా పేరుతో కూలీ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి రెండో పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ శుక్రవారం (జులై 11) విడుదల చేశారు.

పూజా హెగ్డే అందాలతో అదరగొట్టిన ఈ పెప్పీ ట్రాక్‌కు సోషల్ మీడియాలో అభిమానుల...