భారతదేశం, నవంబర్ 7 -- హిందూ సంస్కృతిలో అత్యంత వైభవంగా, పవిత్రంగా జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి. ఈ ఏడాది నవంబర్ 8, ఆదివారం రోజున దీపావళి వేడుకలను జరుపుకోనున్నాం. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య తిథినాడు ఈ పర్వదినాన్ని నిర్వహించుకుంటారు. పౌరాణిక కథనాల ప్రకారం, లంక విజయానంతరం శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాల వనవాసాన్ని ముగించుకుని సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఇదే.

రాముడి రాకతో అయోధ్య ప్రజలు ఇళ్లలో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి ఘనంగా స్వాగతం పలికారు. అప్పట్నుంచే దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ప్రత్యేక రోజున సాయంత్రం వేళ ప్రదోష కాలంలో లక్ష్మీ గణపతి పూజ చేయడం వల్ల ఇళ్లలో అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సరైన విధివిధానాలతో, మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిస్తే జీవితంలో ఆర్థిక సమస...