భారతదేశం, సెప్టెంబర్ 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం సహజం. అయితే గ్రహాలు మారినప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీపావళి తర్వాత కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. దీపావళికి ఈసారి చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు.

గ్రహాల సంచారంలో మార్పు ఉన్నప్పుడు యోగాలు మరింత ఎక్కువగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అక్టోబర్ 22న చూసినట్లయితే సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా తులా రాశిలో సంచారం చేస్తాయి. దీంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ ప్రత్యేకమైన యోగం కొన్ని రాశుల వారికి బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ రాశుల వారు ఆర్థిక లాభాలను కూడా పొందుతారు.

మేష రాశి వారికి ఈ...