భారతదేశం, నవంబర్ 3 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. దీపావళి షాపింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దీపావళి సమయంలో చాలా మంది వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడంతో పాటుగా గృహోపకరణ వస్తువులు, కొత్త కార్లు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.

దీపావళి నాడు లేదా పండుగకు ముందు, తర్వాత శుభ ముహూర్తంలో వస్తువులను ఇంటికి తీసుకువస్తే అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. సంతోషం, ఐశ్వర్యం రెట్టింపు అవుతాయి. జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే, వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు రంగుపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాశికి తగ్గట్టుగా వాహనాలను కొనుగోలు చేయాలి. ఏ రాశి వారు దీపావళికి ఏ రంగు వాహనాలను కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీ రాశికి ఏ రంగు కలిసొస...