భారతదేశం, నవంబర్ 7 -- ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ మూడవ సీజన్ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం (నవంబర్ 7) రిలీజ్ చేసింది. ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ షో ద్వారా మన లవింగ్ స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పేయి తిరిగి వచ్చాడు. ఈసారి శ్రీకాంత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పరారీలో ఉండటం, అలాగే జైదీప్ అహ్లావత్ పోషించిన డ్రగ్ మాఫియా డాన్ తో ఫైట్ ఆసక్తి రేపుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో శుక్రవారం మధ్యాహ్నం తమ సోషల్ మీడియాలో సీజన్ 3 ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ ప్రారంభంలోనే శ్రీకాంత్ (మనోజ్ బాజ్‌పేయి) తన కుటుంబానికి తాను ఒక గూఢచారిని అని చెప్పడంతో ఉత్కంఠ మొదలవుతుంది. అదే సమయంలో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ప్రక...