దిల్లీలో దారుణం.. షోరూమ్ ట్రయల్ రూమ్‌లో యువతి గొంతుకోసి హత్య!
భారతదేశం, నవంబర్ 15 -- దేశ రాజధాని దిల్లీలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది! పశ్చిమ దిల్లీలోని మోతీ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఒక వస్త్ర దుకాణం ట్రయల్ రూమ్‌లో ఒక 18 ఏళ్ల యువతి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. మృతురాలిని పశ్చిమ దిల్లీకి చెందిన షబ్నమ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సూరజ్ అనే యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, శనివారం సాయంత్రం షబ్నమ్ తన షిఫ్ట్ ముగించుకుని ఇంటికి బయలుదేరే సమయానికి నిందితుడు సూరజ్ షోరూమ్‌కు వచ్చాడు. అప్పటికే అతడు తన వెంట పదునైన ఆయుధాన్ని తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. షబ్నమ్తో ఏదో ముఖ్యమైన విషయం మాట్లా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.