భారతదేశం, నవంబర్ 15 -- అప్డేట్ చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది కదా అని అన్నారు మహేష్ బాబు. ఆయన హీరోగా, రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా 'వారణాసి'. శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఈ మూవీ టైటిల్ ను, మహేష్ లుక్ ను రిలీజ్ చేశారు.

గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో వారణాసి టైటిల్ ను స్పెషల్ వీడియోతో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఈ ఈవెంట్లో మహేష్ బాబు స్పీచ్ వైరల్ గా మారింది.

''అప్టేడ్.. అప్టేడ్.. అని అడిగారు కదా. ఎలా ఉంది అప్డేట్. మన డైలాగే చెప్పాలి. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. నాక్కూడా అలాగే ఉంది. నాన్నగారంటే నాకెంతో గౌరవం. ఆయన ఇలాంటి క్యారెక్టర్లు చేయమని అంటుండేవారు'' అని మహేష్ బాబు తెలిపారు.

ఇది కేవలం టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రమేనని మహేష్ బా...