Hyderabad, అక్టోబర్ 1 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో విజయదశమి ఒకటి. విజయ దశమి నాడు అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తారు. నవరాత్రులు తొమ్మిది రోజులు రోజుకో రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. పదవ రోజు విజయ దశమిని ఘనంగా జరుపుతారు. తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగ విజయ దశమి. ఉత్తర భారత దేశంలో కూడా నవరాత్రులను ఘనంగా జరుపుతారు.

ఈ ఏడాది విజయ దశమి అక్టోబర్ 2న వచ్చింది. చెడుపై మనిషి గెలిచిన సందర్భంగా విజయదశమిని జరుపుకుంటాము. విజయదశమి విశిష్టత, జమ్మి పూజ, ఆయుధ పూజతో పాటు మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

విజయదశమి పండుగలో జమ్మి చెట్టు పూజ ఒక ఆచారం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పాటిస్తారు. విజయదశమి నాడు జమ్మి చెట్టును ఆరాధిస్తే శుభఫలితాలు కలుగుతాయి. జమ్మి ఆకులను బంగారంలా భావించి పంచుకుంటారు. జమ్మి చెట్లను పూజిస్తే విజయం, శ్రేయస్సు కలుగుత...