భారతదేశం, అక్టోబర్ 19 -- తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాము. అందులో 9వ రోజు మహా నవమి. శరన్నవరాత్రులలో ప్రధానమైనది. మహానవమి రోజు అమ్మవారిని ఆరాధించాలి. ఈ తొమ్మిది రోజులు పూజలు చేయలేని వారు సప్తమి నుంచి మూడు రోజులపాటు పూజలు చేస్తారు. అది కూడా కుదరకపోతే మహానవమి రోజున అమ్మవారిని ఆరాధిస్తారు. విజయదశమి పునః పూజ మాత్రమే చేయాలి. నవమి రోజు పూజ చేస్తేనే దశమి రోజు పునః పూజను చేయాలి.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా దేవీ నవరాత్రుల ఉత్సవాలను జరుపుకుంటాము. నవరాత్రుల్లో చివరి రోజు శుక్ల నవమిని మహానవమి అంటారు. మహానవమి నాడు అమ్మవారికి ఇష్టమైన పిండివంటలతో పాటు చెరకు గడలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.

తెలంగాణలో మహానవమి నాడు బతుకమ్మ పూజ చేస్తారు. అలాగే సరస్వతీ ఉద్యాపన చేయడం జరుగుతుంది. కేరళ రాష్ట్రంలో నవమి నాడు ఆయుధ పూజ చ...