Hyderabad, సెప్టెంబర్ 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దసరా రోజు అంటే అక్టోబర్ 2న బుధుడు తులా రాశిలోకి అడుగుపెడతాడు. కుజుడు కూడా ఇప్పటికే తులా రాశిలో ఉన్నాడు. దీంతో ఈ రెండిటి సంయోగం ఏర్పడనుంది. రెండు గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రానుంది.

ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడినా, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. అక్టోబర్ 27 వరకు ఈ రెండు గ్రహాల సంయోగం ఉంటుంది. దసరా నుంచి దీపావళి వరకు కుజ-బుధుల సంయోగంతో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.

మేష రాశి వారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు రావడంతో మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ గ్రహాల సంయోగంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. మానసికంగా బలంగా ఉంటారు. కెరీర్‌ల...