Hyderabad, సెప్టెంబర్ 24 -- సకల జీవులకు ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిని పూజిస్తే ఆహారానికి లోటు ఉండదు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం. కనుకే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. అన్నపూర్ణాదేవిని ఆరాదిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి ఉంటాయి.

దసరా నవరాత్రులు మొదలయ్యాయి. మొదటి రోజు బాలా త్రిపురసుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు. రెండవ రోజు గాయత్రి దేవి, మూడవ రోజు అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. అన్నపూర్ణాదేవిని ఈరోజు ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి.

ఈ అన్నపూర్ణ స్తోత్రాన్ని చదివితే కూడా అన్నపూర్ణ దేవి ప్రత్యేక ఆశీస్సులు లభించి దేనికి లోటు ఉండదు. ముఖ్యంగా అన్నపూర్ణ దేవిని పూజిస్తే అన్నానికి లోటు ఉండదు. ధనధాన్య వృద్ధి కలుగుతుంది, సంతోషంగా ఉండొచ్చు.

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ

నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష...