Hyderabad, సెప్టెంబర్ 26 -- విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీ అమ్మవారికి వేకువ జాము నుంచే దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారు అమితమైన పరాక్రమంతో .... డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది.

అన్ని సౌఖ్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ ఆ దేవిస్వరూపమే. దీనికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారు. బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, ఇంటిల్లిపాదికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా. అన్ని రూపాల్లో...