Hyderabad, సెప్టెంబర్ 24 -- నవరాత్రులు ఇప్పటికే మొదలైపోయాయి. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు. ప్రతి రోజు రకరకాల నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో చాలా చోట్ల నవరాత్రులను ఘనంగా జరుపుతారు. నవరాత్రి సమయంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనేది చూసుకుని కొత్త దుస్తుల్ని కూడా ధరిస్తూ ఉంటారు. నవరాత్రుల్లో కొత్త దుస్తులతో పాటు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి.

నవరాత్రుల సమయంలో వీటిని కొంటే సంతోషం ఎక్కువవుతుంది, కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి, దుర్గాదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. మరి మనం నవరాత్రుల్లో ఏ వస్తువులను కొనుగోలు చేస్తే మంచిది? వేటి వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి?

నవరాత్రుల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. డబ్బు...