Hyderabad, సెప్టెంబర్ 22 -- దేశవ్యాప్తంగా నవరాత్రులను ఘనంగా జరుపుతారు. తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22న దసరా నవరాత్రులు మొదలై, అక్టోబర్ 2 విజయ దశమితో ముగుస్తాయి. దసరా నవరాత్రుల్లో కచ్చితంగా వీటిని పాటించేటట్టు చూసుకోండి. వీటిని పాటించడం వలన కనకదుర్గ అనుగ్రహం ఉంటుంది. దసరా నవరాత్రుల వేళ ఏం చేయాలి? వేటివలన శుభ ఫలితాలను పొందవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.

దసరా నవరాత్రుల్లో వీటిని పాటిస్తే ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. దసరా నవరాత్రులలో చేసే పూజ చాలా విశేషమైనది. దసరా నవరాత్రులు అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞానం, సంపద కలుగుతాయి. ఐశ్వర్యం, సంతానం, సంతోషం కూడా మీ వెంటే ఉంటాయి.

దసరా నవరాత్రులు ఆకలి, పేదరికం తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను పాటిస్తే మంచిది. అదే విధంగా దసరా సమయంలో చేసే పూజల వలన సకల పాప...