భారతదేశం, అక్టోబర్ 7 -- దేశవ్యాప్తంగా దసరా పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుతారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటారు. శారదీయ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు.

పదవ రోజు విజయ దశమి పండుగను జరుపుతారు. 2026లో దసరా నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 19న నవమి వచ్చింది. అలాగే అక్టోబర్ 20న విజయదశమి జరుపుకుంటాము.

ఈ ఏడాది విజయదశమి అక్టోబర్ 20, మంగళవారం నాడు వచ్చింది. ముహూర్తం విషయానికి వస్తే, విజయదశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:59 నుంచి 2:45 వరకు ఉంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడం మంచిది. అలాగే ఆయుధ పూజ, ప్రత్యేక పూజలను కూడా ఈరోజు నిర్వహించాలి.

దశమి తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 12:50 గంటల నుంచి అక్టోబర్ 21 మధ్యాహ్నం 2:11 వరకు కొనసాగుతుంది. పంచాంగం ప్రకారం తిథ...