భారతదేశం, అక్టోబర్ 1 -- బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ సినిమా 'మన శంకరవర ప్రసాద్ గారు'. ఇందులో నయనతార హీరోయిన్. సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవి, నయనతార కలిసి నటిస్తున్న మూవీ ఇది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ఈ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 1) మన శంకరవర ప్రసాద్ గారు హీరోయిన్ నయనతార ఫస్ట్ లుక్ ను అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు.

మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ నయనతార శశిరేఖ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. శశిరేఖగా నయనతారను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను బుధవారం రిలీజ్ చేశాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

''మన శంకరవర ప్రసాద్ గారు నుంచి శశిరేఖగా నయనతారను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ అందమైన పాత్రలో ఆమె ఉండటం, ఆమెతో పని చేయడం అంతులేని ఆనందాన్ని అందిస్తుంది. ...