భారతదేశం, నవంబర్ 10 -- అమ్మకాల పరిమాణం పరంగా భారతదేశంలో నంబర్ వన్ టూ-వీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్. ఈ దేశీయ ఆటో దిగ్గజం చాలా కాలంగా ఈ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న మోడల్ స్ల్పెండర్​ సిరీస్ అనడంలో సందేహం లేదు.

ఈ ఐకానిక్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సిరీస్‌లో ప్రస్తుతం స్ల్పెండర్​+ ఎకస్​టీఈసీ 2.0, స్ల్పెండర్​+, స్ల్పెండర్​+ ఎక్స్​టీఈసీ, సూపర్ స్ల్పెండర్​ ఎక్స్​టీఈసీ సహా నాలుగు వేర్వేరు మోడల్స్ ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్స్ 100 సీసీ నుంచి 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.

హీరో స్ల్పెండర్​ బైక్​ 1994లో తొలిసారిగా భారత మార్కెట్‌లోకి ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా ప్రవేశించింది. అప్పటి నుంచి, డిజైన్‌లో మార్పులు, టెక్నాలజీ పరిణామాలు ఉన్నప్పటికీ, ఈ మోడల్ ప్రాథమిక డిజైన్ ఫిలాసఫీ, దాని అనుబంధ మ...