భారతదేశం, ఆగస్టు 10 -- హిందూ సంప్రదాయంలో పూజా కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు మరియు శుభకార్యాలలో దర్భ అనే ఓ రకానికి చెందిన పవిత్రమైన గడ్డికి అత్యున్నత స్థానం ఉంది. ఋగ్వేదం నుంచి భగవద్గీత వరకు ప్రతి గ్రంథంలోనూ దీని ప్రస్తావన కనిపిస్తుంది.

గీతా శాస్త్రంలోనూ దీని ప్రాముఖ్యతను ప్రత్యేకంగా వివరించారు. కేవలం పూజలే కాకుండా దైవిక కార్యక్రమాలలో ఇది లేకపోతే ఆ ఆచారం అసంపూర్ణంగా భావిస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే ఈ పవిత్ర గడ్డి గురించి మన పెద్దలు చెప్పిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

మన పురాణాలు ఈ దర్భను సాక్షాత్తు శ్రీమహావిష్ణువు స్వరూపంగా అభివర్ణించాయి. ఇది పరిసరాలలోని ప్రతికూల శక్తిని తరిమికొట్టి, వాతావరణాన్ని పూర్తిగా సాత్వికంగా మారుస్తుంది. దేవతలు, పితృ దేవతలను ప్రసన్నం చేసుకునే క్రమంలో దీన్ని ఉపయోగించడం ఆచారంగా వస్తోంది. వ...