Hyderabad, అక్టోబర్ 7 -- నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన అద్భుతం 'కాంతార ఛాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అటు సోషల్ మీడియా అంతటా అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటూనే ఉంది. అయితే కొద్ది రోజుల కిందట దైవం వేషధారణలో ఉన్న ఒక అభిమాని తమిళనాడు థియేటర్‌లోకి ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. మరికొందరు అభిమానులు థియేటర్ వెలుపల సినిమాలోని ఒక సన్నివేశాన్ని ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం (అక్టోబర్ 7) నాడు హోంబలే ఫిల్మ్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సినిమాలో చూపించిన దైవాల పాత్రలను అనుకరించడం లేదా కాజువల్‌గా మిమిక్రీ చేయవద్దని, అవి 'ప్రదర్శన కోసం ఉద్దేశించినవి కావు' అని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

కాంతార ఛాప్టర్ 1 థియేటర్లలో దూసుకెళ్తున్న సమయంలో హోంబలే ఫిల్మ్స్ తన ఎక్స్ ఖాతాలో ఓ ప్రకటన జారీ చేసింది. "స...