భారతదేశం, ఏప్రిల్ 10 -- లోకంలో గురువు స్థానం అత్యున్నతమైనది. అంధకారం లాంటి అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానమార్గం వైపు నడిపించేవాడే అసలైన గురువు. అటువంటి గురువులకే గురువు, సాక్షాత్తు పరమశివుని స్వరూపమైన దక్షిణామూర్తిని "జ్ఞానానందమయం దేవం" అని కొలుస్తాం. మర్రి చెట్టు కింద మౌన ముద్రలో కూర్చుని, తన చుట్టూ ఉన్న మునులకు కేవలం తన చిన్ముద్ర ద్వారానే పరమార్థాన్ని బోధించిన దక్షిణామూర్తిని దర్శించుకోవడం, ఆయన స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాలు అపారం.

ఎనిమిదవ శతాబ్దంలో జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు ఈ 'దక్షిణామూర్తి స్తోత్రాన్ని' రచించారు. ఇది కేవలం భక్తి పూర్వక ప్రార్థన మాత్రమే కాదు, అద్వైత వేదాంత సారాన్ని తనలో ఇముడ్చుకున్న ఒక గొప్ప తత్వ విచారణ. పది శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం, ప్రతి పద్యంలోనూ సృష్టి రహస్యాలను, ఆత్మజ్ఞానాన్ని వివరిస్తుంది.

పఠించే...