భారతదేశం, డిసెంబర్ 22 -- సస్పెన్స్ థ్రిల్లర్లలో ఓ ట్రెండ్ సెట్ చేసిన మూవీ దృశ్యం. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత దృశ్యం 2 వచ్చింది. ఈ సినిమాలను తెలుగు, హిందీలో రీమేక్ చేశారు. ఇప్పుడు మలయాళంలో దృశ్యం 3 తెరకెక్కుతోంది. మరోవైపు హిందీలోనూ దృశ్యం 3 రెడీ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను సోమవారం (డిసెంబర్ 22) అనౌన్స్ చేశారు.

హిందీలో అజయ్ దేవగన్ హీరోగా యాక్ట్ చేస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం 'దృశ్యం 3'. ఈ మూవీ విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. సోమవారం ఉదయం చిత్ర నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2, 2026న విడుదల కానుందని ఓ టీజర్ తో అనౌన్స్ చేసింది.

అక్టోబర్ 2 తేదీకి దృశ్యం ఫ్రాంఛైజీకి ఒక ప్రత్యేక సంబంధం ఉంది. కొత్త ప్రోమో ప్రకారం, 'దృశ్యం 3' 2026 అక్టోబ...