Hyderabad, జూన్ 27 -- మంచు విష్ణు కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. బాలీవుడు డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, మధుబాల, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్స్ నటించిన విషయం తెలిసిందే.

అయితే, కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించండతో మూవీపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. దానికి తోడు కన్నప్ప టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ కనిపించిన తీరుకు మూవీపై ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ను చూసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయ్యారు.

ఇక భారీ అంచనాల నడుమ ఇవాళ (జూన్ 27) వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో కన్నప్ప సినిమా విడుదల అయింది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప మూవీలోని ప్రభాస్ ఎంట్రీ సీన్ లీక్ అయింది. థియేటర్ నుంచి లీక...