భారతదేశం, ఆగస్టు 17 -- థియేటర్లలో ఒకే రోజు రిలీజైన రెండు తమిళ సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనూ క్లాష్ కాబోతున్నాయి. ఒకే డేట్ నాడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఆ సినిమాలే 'తలైవన్ తలైవి', 'మారీసన్'. ఈ రెండు తమిళ సినిమాల మధ్య మరోసారి ఫైట్ జరగబోతుంది. బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డ ఈ మూవీస్.. ఇప్పుడు ఓటీటీ పోరుకు సై అంటున్నాయి.

విజయ్ సేతుపతి, నిత్య మీనన్ జంటగా నటించిన తలైవన్ తలైవి.. ఫాహద్ ఫజిల్, వడివేలు నటించిన మారీసన్ ఒకే రోజు థియేటర్లో రిలీజయ్యాయి. జులై 25న థియేటర్లలో విడుదలయ్యాయి. ఇప్పుడు రెండు సినిమాలు ఓటీటీలోనూ ఒకే రోజు రాబోతున్నాయి. ఆగస్టు 22న తలైవన్ తలైవి, మారీసన్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి.

తలైవన్ తలైవి సినిమా ఆగస్టు 22న ఓటీటీలోకి రాబోతుందని ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫ్యామిలీ డ్రామా రిలీ...