Hyderabad, జూలై 22 -- తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. ఈ ఏడాది మే 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను ప్రేక్షకులు అసలు ఆదరించలేదు. ఐఎండీబీలోనూ కేవలం 4.4 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే గతవారం జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో డిజాస్టర్ టాక్ సంపాదించి.. ఓటీటీలో దూసుకెళ్లే సినిమాల జాబితాలో ఇదీ చేరింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన మూవీ భైరవం. ఈ సినిమా జులై 18న జీ5 ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. తొలి నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకోవడం విశేషం.

థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన సినిమాను ఓటీటీలో ఈ స్థాయిలో ఆదరించడం నిజంగా అనూహ్యమే అని చెప్పాలి. ఈ రికార్డు వ్యూస్ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ...