భారతదేశం, అక్టోబర్ 3 -- కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 1: ఎన్నో అడ్డంకులు దాటుకొని కాంతార చాప్టర్ 1 గురువారం (అక్టోబర్ 2) థియేటర్లలోకి వచ్చేసింది. 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారకు ఇది ప్రీక్వెల్. రిషబ్ శెట్టి హీరోగా చేయడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ ఫోక్ థ్రిల్లర్ కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజైంది. ఫస్ట్ డే కాంతార 2 అదిరే కలెక్షన్లు రాబట్టింది.

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం కాంతార చాప్టర్ 1 తొలి రోజు ఇండియాలో రూ.60 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. భారతదేశంలో అన్ని భాషల్లో కలిపి 4 లక్షలకు పైగా కాంతార చాప్టర్ 1 టిక్కెట్లు అమ్ముడయ్యాయని ట్రాకర్ నివేదించింది. ఈ చిత్రం మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్‌ల పరంగా బలమైన ట్రెండ్‌లను చూపించింది. ఇది అడ్వాన్స్ టిక్కెట్ విక్రయం ద్...