భారతదేశం, ఫిబ్రవరి 5 -- ఓటీటీలోని పాపులర్ వెబ్ సిరీస్ ల్లో 'మీర్జాపూర్' ఒకటి. అసలు ఈ సిరీసే ఓ సంచనలం. అధికారం, ఆధిపత్యం కోసం సాగే పోరు చుట్టు అల్లుకున్న కథతో తెరకెక్కిన మీర్జాపూర్ లో అడ్డూ అదుపు లేని అసభ్య పదాలు, బోల్డ్ సీన్లు చాలానే ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఓటీటీలోకి రాగానే సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడు సీజన్ ల తర్వాత ఓ మూవీ నేరుగా థియేటర్లలోకి రానుంది.

ఇండియన్ పాపులర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ మూడు సీజన్లు ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాయి. ఇక ఈ సిరీస్ జర్నీ సినిమాగా మారి బిగ్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. మీర్జాపూర్ ది మూవీ పేరుతో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ (ఫిబ్రవరి 5) మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4, 2026న రిలీజ్ కానుంది.

మీర్జాపూర్ ది మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ స్పెషల్ పోస్ట...