Hyderabad, జూలై 29 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశుల నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత దరిద్ర రాజయోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశి వారికి సమస్యలను తీసుకువస్తుంది.

గ్రహాల సంచారం ఒక్కోసారి అశుభ ఫలితాలను కూడా తీసుకొస్తూ ఉంటాయి. ఆగస్టు నెలలో చూసినట్లయితే సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో కేతువు సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడడంతో దరిద్రయోగం ఏర్పడుతుంది.

ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు సతమతం అవ్వాల్సి ఉంటుంది. మరి ఏయే రాశుల వారికి సమస్యలు వస్తాయి? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి ఈ దరిద్ర రాజయోగం వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో అశాంతి కలుగుతుంది. ఆర్థికపరంగా సమస్య...