భారతదేశం, మే 23 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా సంపద, వైభవం, విలాసాలకు కారకుడైన శుక్రుడు.. ఆధ్యాత్మికత, మోక్షం, అనూహ్య మార్పులకు సంకేతమైన కేతువుతో కలిసినప్పుడు విలక్షణమైన పరిస్థితులు ఏర్పడతాయి. 2026 జూలై మాసంలో ఇలాంటి ఒక అరుదైన కలయిక సింహ రాశిలో జరగబోతోంది.

ప్రస్తుతం సింహ రాశిలో కేతువు ఉన్నాడు. జూలై 4వ తేదీన శుక్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసొస్తే, మరికొన్ని రాశుల వారు మాత్రం మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ్ఞతుంది.

సింహ రాశిలో ఈ గ్రహాల కలయిక వల్ల రిలేషన్ షిప్స్ లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భావోద్వేగాల విషయంలో పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడ...