Hyderabad, జూలై 28 -- జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు తిరోగమనాన్ని ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. బుధుడు వ్యాపారం, వాక్కు, తెలివితేటలు, నెట్‌వర్కింగ్ వంటి వాటికి కారకుడు. జాతకంలో బుధుడు స్థానం బలంగా ఉంటే ఆ రాశి వారు శుభఫలితాలను ఎదుర్కొంటారు. అదే బలహీనంగా ఉంటే నష్టాలను ఎదుర్కొక తప్పదు.

తొమ్మిది గ్రహాల్లో బుధుడు చాలా చిన్న గ్రహం. ఇది12 రాశులను ప్రభావితం చేస్తుంది. కర్కాటక రాశిలో ఉండగా జూలై 18న బుధుడు తిరోగమనం చెందాడు. ఆగస్టు 11న బుధుడు ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు.

బుధుడి ప్రత్యక్ష సంచారం కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. మరి బుధుడు ప్రత్యక్ష సంచారంతో ఏయే రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి? వంటి విషయాలను తెలుసుకుందాం. బుధుడి ప్రత్యక్ష సంచారం అన్ని రాశుల వారిపైనా ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వ...