Hyderabad, ఆగస్టు 18 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఇతర గ్రహాలతో సంయోగం చెంది శుభ ఫలితాలను, అశుభ ఫలితాలను అందిస్తూ ఉంటాయి. గ్రహాలకు రాజు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆగస్టు 17న సూర్యుడు సొంత రాశి అయినటువంటి సింహ రాశిలోకి ప్రవేశించాడు.

ఇది ఇలా ఉంటే, ఆగస్టు 30న బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాలు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. బుధాదిత్య రాజయోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందించనుంది. ఏ రాశుల వారు బుధాదిత్య రాజయోగంతో శుభ ఫలితాలను అందుకుంటారో, ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి.

మిధున రాశి వారికి బుధాదిత్య రాజయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు. ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో పన...